భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం
✍️దుర్గా ప్రసాద్
భద్రాది జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నియోజకవర్గంలో డిసిసి కార్యాలయం నందు మహమ్మద్ గౌస్ మొనుద్దీన్ గారి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సమిదాన్ బచావో సభ్యులు మరియు టిపిసిసి సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ జేబీ శౌరి మరియు టిపిసిసి జనరల్ సెక్రెటరీ మోతుకూరి ధర్మారావు పాల్గొని పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి కాంగ్రెస్ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది.
అనంతరం నాయకులు మాట్లాడుతూ…
40 ఏళ్ల వయసులోనే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి గా బాధ్యతలు స్వీకరించి ఐటి రంగాన్ని దేశానికి పరిచయం చేసి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి తన హాయంలో టెక్నాలజీకి పెద్దపీట వేశారు.
టెలి కమ్యూనికేషన్స్, వాణిజ్య,రక్షణ, విమానయాన సంస్కరణలు ప్రవేశపెట్టారు.
విద్యావకాశాల సమానత్వం కోసం నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ను తీసుకొచ్చారు. ఇవన్నీ అనుభవిస్తున్నాము అంటే అది రాజీవ్ గాంధీ గారి పుణ్యమే.
దేశం కోసం ప్రాణాలర్పించిన భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు
ఈ కార్యక్రమంలో 29వ వార్డు మాజీ కౌన్సిలర్ తంగెళ్ల లక్ష్మణ్, గరిపేట మాజీ ఎంపీటీసీ కసానబోయిన భద్రం, కారుకొండ మాజీ సర్పంచ్ బానోత్ ఈశ్వర్ సింగ్, తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా కార్డినేటర్ వీరాపురం రామ్ లక్ష్మణ్, NSUI జిల్లా అధ్యక్షుడు అజ్మీరా సురేష్ నాయక్, జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షుడు కరీం పాషా, కొత్తగూడెం పట్టణ ఓబిసిఎల్ అధ్యక్షుడు జయప్రకాష్, యువజన నాయకులు గడ్డం రాజశేఖర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏలూరి రాందాస్, ఎలుక పెళ్లి లక్ష్మయ్య, ఆదరి కొమరయ్య, మాదా శ్రీరాములు, మూతి కనకయ్య, బానోత్ రామ్ కిషన్, మహిళా నాయకురాలు శివలక్ష్మి, మర్రి బాలమ్మ, వాంకులో జగదాంబ, ASJ జిల్లా అధ్యక్షుడు కరీం పాషా, మైనార్టీ నాయకులు మెహబూబ్ ఖాదరి, అలీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
- మోతె పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేదెన్నడు…
- భద్రాచలం ITDA PO రాహుల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు.
- రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
- సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించిన ఆదివాసి ఆణిముత్యం
- వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్
