భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
భద్రాచలం
✍️దుర్గా ప్రసాద్

భద్రాచలం : నివాసి 60 ఏళ్ల రామలక్ష్మి (బరువు 150 కిలోలు), గత మూడు నెలలుగా పొట్ట నొప్పి, వెన్నునొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

ఖమ్మం, హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించగా కిడ్నీలో 25 మిల్లీమీటర్ల పెద్ద రాయి అధిక రక్తపోటు, అధిక షుగర్, హృదయ సమస్యలు ఉన్నట్లు తేలింది.

క్లిష్టమైన పరిస్థితుల్లో పలు ఆసుపత్రులు “శస్త్రచికిత్స అసాధ్యం” అని నిరాకరించాయి.

అయితే, భద్రాచలంలోని MIMS Super Speciality Hospitalలో యూరాలజిస్ట్ డా. హరీష్ చల్లా , ఈ సవాలును ధైర్యంగా స్వీకరించారు. రెండు కిడ్నీలు అతుక్కున్న అరుదైన పరిస్థితి మధ్య అత్యంత జాగ్రత్తగా శస్త్రచికిత్స చేసి, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తిగా ఉచితంగా విజయవంతంగా పూర్తి చేశారు.

error: -