భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
భద్రాచలం
✍️దుర్గా ప్రసాద్

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంటగంటకు పెరుగుతుంది. ఉదయం 8 గంటలకు 43 అడుగులు ఉండగా, మధ్యాహ్నం 12 గంటల సమయానికి 44.4 అడుగులకు చేరింది.

కాగా 43 అడుగుల వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులు ఆదేశించారు. నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

error: -