భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్

మణుగూరు ఓసి విస్తరణ సందర్భంగా నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అడిషనల్ కలెక్టర్ డి. వేణుగోపాల్ కి వినతిపత్రం అందజేసినట్లు మణుగూరు సామాజిక సేవకులు కర్నే బాబురావు విలేకరి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మణుగూరు ఓసి విస్తరణకు సంబంధించి జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ సభలో మణుగూరు ఓసి విస్తరణ తప్పనిసరి అని భావిస్తూ మేము సానుకూలంగా పాజిటివ్ గా స్పందిస్తున్నాము అలాగే ఈ క్రింది సమస్యల పరిష్కారానికి మీ ద్వారా తగుచర్యలుచేపట్ట వలసిందిగా కోరారు.

నిర్వాసిత గ్రామాల ప్రజలకు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులుగా ఉపాధి కల్పించాలి అయితే ఇది పూర్తిస్థాయిలో అమలు కావటం లేదన్నది మాకున్న అభిప్రాయం స్థానిక ఎస్ఎంఎస్ ప్లాంట్లు (బ్లాస్టింగ్ విభాగం) లో సింగరేణి యాజమాన్యం ఆదేశాలను బేఖాతరు చేస్తూ సంబంధిత కాంట్రాక్టర్ ఇటీవల కాలంలో 30 మందికి పైగా నాన్ పిడిఎఫ్ లను పనిలో పెట్టుకున్నాడని, ఎక్స్క్లూజివ్ క్యారియర్ డ్రైవర్లుగా ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకున్నారని నిర్వాసితుల ఆరోపణ దీనిపై విచారణ జరిపించాలి.

అదే నిజమైతే కాంట్రాక్టర్ పై చర్యలు చేపట్టాలి దయచేసి ఆ స్థానంలో నిర్వాసితులకు ఉపాధి కల్పించాలి. అలాగే స్థానిక ఓబీ కంపెనీలలో పని కోసం వెళ్లిన నిర్వాసితులను స్థానికులను లోకల్ వాలెంకో ఇదర్ కామ్ నహీ మిల్తా బాహర్ జావో అంటున్నారు గేటు నుండి సెక్యూరిటీ వారు గెంటివేస్తున్నారు ఇతర సివిల్ పర్చేస్ టెండర్లలో కూడా నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు ఉన్నాయి. పని లేక అనేక మంది మెడికల్ వీటీసీ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు కూడా ఉన్నారూ పని కోసం తిరుగుతున్నారు దయచేసి స్థానిక ఓబీ కంపెనీలలో నిర్వాసితులకు స్థానికులకు సింగరేణి కుటుంబాలు చెందిన నిరుద్యోగులకు 80% ఉపాధి కల్పించే విధంగా తగు ఆదేశాలు జారీ చేయాలని సింగరేణి ఎండి ఎన్. బలరాం ఆదేశాలు కూడా అమలు చేయాలని ఏరియా సింగరేణి యాజమాన్యం కూడా స్పందించాలని ఆయన కోరారు.

error: -