మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:21 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

మున్సిపల్ కమిషనర్ ని సత్కరించిన పద్మశాలి సంఘం నేతలు

బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణం లొని పద్మశాలి భవన్ శివ భక్త మార్కెండేయ దేవాలయంలొ గురువారం మాస శివరాత్రి సందర్బంగా పద్మశాలి కుల సంఘము సభ్యులు భక్తి శ్రద్దలతో పూజలు చేసి, ఆలయ ఆవరణలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు.

ఈ శుభ కార్యంలో విచ్చేసిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ ను పద్మశాలి సంఘం నేతలు శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మాజి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిలివేరి నర్సింగం, కొలిపాక శ్రీనివాస్, భావన ఋషి, కూడికల పాపయ్య, సుంకే లక్షన్, బంక రమేష్, తాటికొండ రమేష్, శ్రీనివాస్, గుండేటి శంకర్, మంతెన భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

error: -