మంచిర్యాల జిల్లా కేంద్రం
తేదీ:21 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

మంచిర్యాల: ప్రభుత్వం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

గురువారం హాజీపూర్ మండలం గుడిపేటలో నిర్మితమవుతున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…

జిల్లాలోని ప్రజలకు మరింత వేగవంతమైన వైద్య సేవలను అందించేందుకు వైద్యులు, సిబ్బంది సంఖ్యను పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు 216 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

ఈ క్రమంలో భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రోడ్డు భవనాల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనూష సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

error: -