సింగరేణి ఎంపీడీవోగా పీ.శ్రీనివాస్‌ బాధ్యతలు స్వీకరణ

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్

సింగరేణి మండల ఎంపీడీవోగా పీ.శ్రీనివాస్‌ నియమితులయ్యారు. భద్రాద్రి జిల్లా డీఆర్‌డీవో కార్యాలయంలో పని చేస్తున్న పీ.శ్రీనివాస్‌ బదిలీపై సింగరేణి ఎంపీడీవోగా వచ్చారు.

సింగరేణి ఎంపీడీవో కార్యాలయంలో ప్రస్తుతం ఇంఛార్జీ ఎంపీడీవో అయిన ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్‌ నుంచి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎంపీడీవోకు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

error: -