భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్

అశ్వాపురం, మండల పరిధిలోని నెల్లిపాక పంచాయితీ లో అశ్వాపురం తహశీల్దార్ మణిధర్ గురువారం గోదావరి వరదల కారణం గా పర్యటించడం జరిగింది.

ఈ సందర్బంగా తహశీల్దార్ గ్రామస్థులతో మాట్లాడుతూ…

ఎగువున కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి కి భారీగా వరదనీరు వస్తున్న క్రమంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తం గా ఉండాలని, వరదనీరు పెరుగుతున్న క్రమంలో ప్రజలు వారి పశువులను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వరద ఉధృతి పెరిగే క్రమంలో ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి రావాలని సూచించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నెల్లిపాక ఆర్ ఐ లావణ్య, నెల్లిపాక గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

error: -