మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:22 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: తెలంగాణా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలకు శిథిలావస్థకు చేరిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయాలనే డిమాండుతో, శుక్రవారం చలో అసెంబ్లీ, సేవ్ తెలంగాణ అని పిలుపునిచ్చారు.
దానిలో భాగంగా బెల్లంపల్లి మండల అధ్యక్షులు గజెల్లి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి బయలుదేరే ముందు, మండల నాయకులను అడ్డుకొని ముందస్తుగా అరెస్టు చేసిన తాళ్లగురజాల పోలీసులు. ఈ అక్రమ అరెస్టులను మండల అధ్యక్షుడు గజెల్లి రాజ్ కుమార్ తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పాలన కాదు పోలీసుల పాలన అని మండిపడ్డారు. ఎన్ని అక్రమ అరెస్టులు చేసిన ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా ముందుంటుందని తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో మండల ప్రధాన కార్యదర్శులు ముత్తే రామన్న, గాదర్ల నగేష్ కార్యదర్శి సాయి నాయకులు మహేష్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి….
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
- కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు…
- విఘ్నాలు లేకుండా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలి….
- బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన డిస్కం ఉద్యోగులు
- మానవత్వం చాటుకున్న యువకుడు…
- గణేష్ మండళ్ల నిర్వాహకులు పోలీసులకు సహరించాలి…
