గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి… – జిల్లా ఎస్పీ సూచన
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా,
తేదీ:22/08/2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి, గణేష్ మండపాల నిర్వహకులకు జిల్లా ఎస్పీ సూచన.
జిల్లాలో లక్కీ డ్రా, లాటరీలు వంటి అక్రమ కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు, అవసరమైతే పీడి యాక్ట్ నమోదు చేస్తాం ~ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్
కుమురం భీమ్ ఆసిఫాబాద్: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో రాబోయే గణేష్ నవరాత్రి వేడుకలు, దసరా వంటి పండుగలు ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు.
జిల్లాలో లక్కీ డ్రాలు, లాటరీలు, బహుమతి పథకాలు వంటి అక్రమ కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఆదేశించారు.
ఎస్పీ మాట్లాడుతూ…, లాటరీ విధానం, లక్కీ డ్రా వంటి కార్యకలాపాలు పూర్తిగా చట్ట విరుద్ధమని, వీటి ద్వారా అమాయక ప్రజలను మోసం చేసి డబ్బులు వసూలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అక్రమ లాటరీలు లేదా లక్కీ డ్రాలను నిర్వహించే నిర్వాహకులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి, శాఖపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అలాగే రాష్ట్రంలో లాటరీలు, లక్కీ డ్రా విధానంపై నిషేధం ఉందని, నిబంధనలను ఉల్లంఘించి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని, అవసరమైతే పీడి యాక్ట్ (PD Act) నమోదు చేయబడుతుందని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, “జిల్లాలో ఎక్కడైనా లాటరీలు లేదా లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712670551 కు తెలియజేయాలని అన్నారు.
జిల్లా ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు విభాగం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, ప్రజలు కూడా విధిగా పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.
ఇవి కూడా చదవండి…
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
- కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు…
- విఘ్నాలు లేకుండా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలి….
- బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన డిస్కం ఉద్యోగులు
- మానవత్వం చాటుకున్న యువకుడు…
- గణేష్ మండళ్ల నిర్వాహకులు పోలీసులకు సహరించాలి…
