మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:22 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి హనుమాండ్ల మధుకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడమైనది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…, తెలంగాణ రాష్ట్రంలో జానపద కళాకారులకు కొదవలేదని రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున పేద కళాకారులకు వారి పొట్ట నిండే విధంగా జీవనోపాధిని సంఘం కల్పిస్తుందని తెలిపారు.

బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు జంజర్ల దినేష్ కుమార్ మాట్లాడుతూ … మరుగున పడుతున్నటువంటి జానపద కళలను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని, అలాగే కళాకారులకు జీవనోపాధిని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ సీనియర్ కళాకారులు బొంకురి రామచందర్, తోటపల్లి రాజేష్, మిట్టపల్లి మల్లేష్, శనిగరపు రాజేందర్, ఇనుముల రాయమల్లు, పోతర్ల లింగయ్య పాల్గొన్నారు.

error: -