పనుల జాతర 2025 లో భాగంగా సీసీ రోడ్డు ప్రారంభోత్సవం మరియు పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
22-08-25
భద్రాచలం నియోజకవర్గం.
✍️దుర్గా ప్రసాద్

భద్రాచలం చర్ల రోడ్డు కేకే ఫంక్షన్ హాల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం మరియు పనుల జాతర 2025 లో భాగంగా రైతులకు పనిముట్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు మాట్లాడుతూ…

భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా సిసి రోడ్లు నిర్మించడం జరుగుతుంది. గతంలో వర్షం వస్తే కేకే ఫంక్షన్ హాల్ ఎదురుగా నీటితో రోడ్ అంతా మునిగిపోయేది. ఈ రోజు అలాంటి సమస్య లేకుండా డ్రైనేజులు నిర్మించాము.
రానున్న రోజుల్లో మరింతగా అభివృద్ధి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

error: -