మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:23 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ కోదండ రామాలయ ప్రధాన అర్చకులు చిమిరాల వేణుగోపాలాచార్యులు శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలియడంతో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వారి నివాసానికి వెళ్ళి ఆయన భౌతికకాయానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే వినోద్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ మాజీ చైర్మన్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

error: -