మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:23 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
ఈరోజు బెల్లంపల్లి ఎంసిపిఐయు పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ ఆధ్వర్యంలో సిపిఐ మాజీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ…, ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి,నినాదాలు చేస్తూ ఘనమైన నివాళులు అర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ… కమ్యూనిస్టు ఉద్యమాలలో తనదైన పోరాటపటిమ చూపిన సుధాకర్ రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారని తెలిపారు.
తెలంగాణ పోరు 2009 లో మొదలైన మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఆయన మద్దతు పలకడమే కాక పార్టీని సైతం ఒప్పించారని, పార్టీ శ్రేణులు ఉద్యమంలో మమేకమయ్యేలా ప్రోత్సహించారని, ఎస్సీ వర్గీకరణపై పలుమార్లు పార్లమెంటులో ప్రస్తావించి చట్ట సవరణకు డిమాండ్ చేశారని, పలు ఇతర సామాజిక ఉద్యమాలకు అండగా నిలిచారని, ఆయన మరణం యావత్తు భారతదేశ ప్రజలకు, కమ్యూనిస్టు పార్టీలకు తీరనిలోటని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాజశేఖర్, సతీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
- కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు…
- విఘ్నాలు లేకుండా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలి….
- బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన డిస్కం ఉద్యోగులు
- మానవత్వం చాటుకున్న యువకుడు…
- గణేష్ మండళ్ల నిర్వాహకులు పోలీసులకు సహరించాలి…
