మంచిర్యాల జిల్లా,
మంచిర్యాల,
తేదీ:23 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
మంచిర్యాల: జిల్లాలో నవభారత సాక్షరత కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా వయోజన విద్య కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, జిల్లా విద్యాధికారి ఎస్.యాదయ్య లతో కలిసి మండల విద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో నవభారత సాక్షరత కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు. నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం కొరకు ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని, నిరక్షరాస్యతను పూర్తిగా తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని, వయోజనులైన ప్రతి ఒక్కరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఉల్లాస్- నవభారత్ సాక్షరత కార్యక్రమం ద్వారా 15 సంవత్సరాలు ఆ పైబడిన నిరక్షరాస్యులను గుర్తించి వారికి ప్రాథమిక అక్షరాస్యత, ప్రాథమిక విద్యతో పాటు కీలక జీవన నైపుణ్యాలు, ఆర్థిక అక్షరాస్యత అందించడం జరుగుతుందని తెలిపారు. ఉల్లాస్ కార్యక్రమాన్ని మండల స్థాయిలో విజయవంతం చేసే విధంగా మండల విద్యాధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సెక్టోరల్ అధికారులు చౌదరి, సత్యనారాయణ, డి.ఆర్.పి.లు జనార్దన్, సుమన్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
- కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు…
- విఘ్నాలు లేకుండా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలి….
- బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన డిస్కం ఉద్యోగులు
- మానవత్వం చాటుకున్న యువకుడు…
- గణేష్ మండళ్ల నిర్వాహకులు పోలీసులకు సహరించాలి…
