మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:24 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేతులు మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని కాంటా అంబేద్కర్ చౌరస్తా వద్ద చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆదివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శంకుస్థాపన చేశారు.

బెల్లంపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో కోటి రూపాయలు టియుఎఫ్ఐడిసి నిధులతో ఈ పనులను చేపట్టనున్నట్టు తెలిపారు. పట్టణ ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింతగా మెరుగుపరిచి రహదారిని ప్రజలకు సౌలభ్యంగా మార్చేందుకు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

error: -