వైద్య వృత్తిని ప్రక్షాళణ చేయడమే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లక్ష్యం.. – తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబెర్ డా.యెగ్గన శ్రీనివాస్…

మంచిర్యాల జిల్లా,
మంచిర్యాల,
తేదీ:24 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

వైద్య వృత్తిని ప్రక్షాళణ చేయడమే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లక్ష్యం..

ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం వైద్య వృత్తికే సంకటం…

ప్రజారోగ్య పరిరక్షణ వైద్యుల భాద్యత…

అర్హత లేని వారు వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు…

తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబెర్ డా.యెగ్గన శ్రీనివాస్…

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం తెలంగాణ మెడికల్ టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించడమైనది. వైద్య వృత్తి ప్రక్షాళణ, నాణ్యమైన వైద్యం అందరికి అందుబాటులో ఉండేలా చూడడటమే ప్రధాన లక్ష్యమని డా.శ్రీనివాస్ తెలిపారు.

అర్హత లేని వారు, అర్హత కలిగి మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ లేని వారు కూడా వైద్యం చేయడం నేరమే అని అన్నారు, వైద్య వృత్తి లో పరిదులు దాటి ప్రవర్తించినా, కాసుల కోసం కక్కుర్తి పడినా, అడ్డధారిలో ధనార్జనే లక్ష్యంగా వ్యవహిరించే ఆసుపత్రుల పైన మెడికల్ కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.

పల్లె ప్రాంతాల్లో ఆర్ఎంపి లు పరిధులు దాటి వైద్యం చేయడం వల్ల ఎంతో మంది ఉన్న వ్యాధి తగ్గకపోగా, కొత్త వ్యాధులకు ప్రాణం పోస్తున్నారని తెలిపారు.
ఇప్పటి వరకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ తనిఖీలు చేసి 540 మంది నకిలీ వద్యులని, 100 కు పైగా నాణ్యత లేని ఆసుపత్రులను గుర్తించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవడమైనదని తెలిపారు.

కాసుల కోసం చీకట్లో అబార్షన్లు చేస్తూ, వివహేతర సంబంధాలను ప్రోత్సహిస్తు, అవసరం లేని వైద్యం చేస్తూ కొందరు వైద్యులు వైద్య వృత్తికే మచ్చ తెస్తున్నారని ,వారిని గుర్తించి వైద్య వృత్తిని ప్రక్షాళణ చేయడమే ప్రధాన లక్ష్యంగా మెడికల్ కౌన్సిల్ పనిచేస్తుందని అన్నారు.

కమిషన్ ఏజెంట్లుగా కొందరు అంబులెన్సు డ్రైవర్ లు, ఆర్ఎంపీ లు, పేద ప్రజల భయాన్ని ఆసరా చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారని, అలాంటి వారి బెడద లేకుండా తక్కువ ధరకే సరైన వైద్యం అందించేలా విధంగా మెడికల్ కౌన్సిల్ పనిచేస్తుందని అన్నారు.

ఎవరైనా ప్రజల ఆరోగ్యాలతో వ్యాపారం చేయాలనీ చూస్తే ఎన్ఎంసీ ఆక్ట్ 2019 సెక్షన్ 34 ,54 ప్రకారం సంవత్సరం పాటు జైలు మరియు అయిదు లక్షల జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అథితులుగా మంచిర్యాల జిల్లా న్యాయమూర్తి వీరయ్య మాట్లాడుతూ…, వైద్య వృత్తి చాలా గొప్పదని వైద్యుడు దేవునితో సమానమని అన్నారు.

కొంత మంది అధిక డబ్బుల కోసం అనవసర వైద్యం చేస్తూ వైద్య వృత్తి కి గ్రహణం పట్టిస్తున్నారని అన్నారు, నకిలీ వైద్యులు అర్హత లేని ఆసుపత్రుల మీద కఠిన చర్యలు తీసుకుంటున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులను అభినందించారు. ప్రజరోగ్య పరిరక్షణ, నాణ్యమైన వైద్యం, పేద ప్రజలకు అందుబాటులో ఉంచాలని వైద్యులకు సూచించారు.

ఈ సందర్భంగా బెల్లంపల్లి అసిస్టెంట్ కలెక్టర్ మనోజ్ మాట్లాడుతూ…, వైద్య వృత్తిని వ్యాపారం చేస్తూ ప్రజారోగ్యానికి ముప్పు తెస్తే కఠిన చర్యలు తప్పవని,నకిలీ వైద్యులని గుర్తిస్తూ మెడికల్ టాస్క్ ఫోర్స్ పని చేయడం చాలా గర్వకారణం అన్నారు.

ఈ కార్యక్రమం లో డా.యెగ్గన సునీత, ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డా.యెగ్గెన సునీత,
డా.విశ్వేశ్వర్ రావు, డా. సంతోష్,డా.రమణ, డా.అనిల్, డా.కిరణ్, డా.నరేష్, తెలంగాణ మెడికల్ టాస్క్ ఫోర్స్ అసోసియేట్ సభ్యులు ఆకుల రవీందర్, అడ్వకేట్ సల్ల నరేష్, అడ్వకేట్ సురేందర్ మాధంశెట్టి, అడ్వకేట్ చందూరి మహేందర్, ఐఆర్.సిఎస్ ప్రధాన కార్యదర్శి నంది రవీందర్ ఏపిపి, అడ్వకేట్ కోటమల్లయ్య,జగన్ మంచిర్యాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు.

error: -