మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:25 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి పట్టణంలోని మెయిన్ బజార్ ఏరియాలో నివాసముంటున్న మహేందర్ చౌదరి సోమవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…,
తమ కొడుకు అరవింద్ చౌదరి నర్సరీ నుండి స్థానిక యువ సంఘటన్ పాఠశాలలో చదివాడు. 3 వ తరగతి లో చదువుతుండగా ఆరోగ్య సమస్యలు తలెత్తి, కాళ్ళు చచ్చు బడిపోవడంతో వైద్యం చేయిస్తూ, బాలుని కోరిక మేరకు విద్యాభ్యాసాన్ని కోసాగిస్తూ వీల్ చైర్ ఏర్పాటు చేసి ఒక కేయర్ టేకర్ ని నియమించి పంపించగా పాఠశాల యాజమాన్యం తో పాటు కరెస్పాండెన్స్ తోట పోచన్న అనే వ్యక్తి దురుసుగా ప్రవర్తిస్తూ విద్యా సంవత్సరానికి అనుమతించారు.
తిరిగి 4 వ తరగతి లో(2024- 25) విద్యా సంవత్సరంలో పాఠశాలకు రావొద్దని నిరాకరించారు. దీనితో పాఠశాల యాజమాన్యమును, కరెస్పాండెన్స్ ను ప్రాధేయపడినప్పటికీ ఫలితం లేకపోవడంతో, ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేయడంతో పాటు, జిల్లా విద్యాధికారి, మండల విద్యాధికారులకు పిర్యాదు చేయడమైనది, దీనితో స్పందించిన అధికారులు పాఠశాలలో విద్యార్థిని అనుమతించాలని పాఠశాలకు ఆదేశాలు జారి చేసారు.
అనంతరం విద్యార్థిని పాఠశాలకు తీసుకొని వెళ్లగా తెల్ల పేపరుపై సంతకము తీసుకొని అనుమతించి, నిత్యం ఏదో ఒక సాకుతో నానా దుర్భాషలాడుతూ నాతో పాటు నా కుమారుడు అరవింద్ చౌదరి ని మానసిక హింసలకు గురిచేయడం పరిపాటిగా మారింది. పాఠశాల పై అంతస్తులో 4 వ తరగతి క్లాసుకు హాజరయ్యేందుకు, భారీ వర్షాలలో సైతం, ర్యాంపు సౌకర్యం ఉన్నా అనుమతించక మెట్ల పై నుండే తీసుకు వెళ్లాలని యాజమాన్యం కరెస్పాండెట్ ఆవేదనకు గురి చేశాడు.
ఈ విషయమై నా కుమారుడు జిల్లా కలెక్టర్, విద్యాధికారులకు పిర్యాదు చేద్దామని పలుమార్లు చెప్పినా నేను పట్టించుకోలేదు. అయినా పాఠశాల యాజమాన్యం మాత్రం మానసిక హింసలకు గురిచేయడం మానలేదు. ఈ క్రమంలో నా కుమారిని ఆరోగ్యం మెరుగు పడాలని మా ఇలవేల్పు దర్శనం కోసం తీర్థ యాత్రలు వెళ్లగా మేము ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైన సంఘటనలో ప్రమాదవశాత్తు నా కుమారుడు అరవింద్ చౌదరి మృతి చెందాడు.
పాఠశాలలో కరస్పాండెంట్ గా కొనసాగుతున్న తోట పొచన్న మానసిక హింసల నుండి నా కుమారుడు పడిన ఇబ్బందులను మరో విద్యార్థి ఇబ్బందులు పడకుండా ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు,యువ సంఘటన్ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి పై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్,విద్యా శాఖ అధికారులు యువసంఘటన్ పాఠశాల వ్యవహార శైలి పై దృష్టి సారించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.
ఇవి కూడా చదవండి…
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
- కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు…
- విఘ్నాలు లేకుండా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలి….
- బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన డిస్కం ఉద్యోగులు
- మానవత్వం చాటుకున్న యువకుడు…
- గణేష్ మండళ్ల నిర్వాహకులు పోలీసులకు సహరించాలి…
