మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:25 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: దీర్ఘకాలికంగా బెల్లంపల్లి పట్టణంలో నెలకొన్న సమస్యలపై సోమవారం ప్రజా వాణి లో సబ్ కలెక్టర్ మనోజ్ కు వినతి పత్రం సమర్పించిన రేవంత్ రెడ్డి సైన్యం నాయకుడు కొలిపాక శ్రీనివాస్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బెల్లంపల్లి మున్సిపాలిటీలో 15 సెప్టెంబర్ 2001 వ సంవత్సరంలో కాలువ పైన దుకాణాలు ఉన్నాయని దాదాపు 180 దుకాణాలు, ఇళ్లు కూల్చివేసిన మున్సిపల్ అధికారులు. బజార్ ఏరియా లో ప్రజలు నడిచే రహదారులు కిక్కిరిసినా పట్టించుకోవడం లేదని అన్నారు.18వార్డ్ కాంటాక్టర్ బస్తీ లో ని పాత గీత మహల్ హోటల్ వెనుక గల కాలువ టీఆర్ఎస్ పార్టీ హయం నుండి బురద నీరు తో చెత్త కాగితాలతో మట్టి కుప్పలతో నిండి పోవడం గురించి ప్రస్తావించారు.

వెంటనే ఈ కాలువ లోనీ చెత్త కుప్పలను తొలగించి, స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియాకి సీసీ రోడ్ నిర్మించి ప్రజల దూర బారం తగ్గిస్తూ నడక మార్గం కల్పించాలని కోరారు. మెయిన్ రోడ్ పైన ఫుట్ పాత్ పై దుకాణా వల్ల ప్రజలు తమ ద్విచక్ర వాహనాలు రోడ్ పై పెట్టడంతో ప్రజలు నడి రోడ్ పై నడిచి ప్రమాద పాలవుతున్నారని అన్నారు. ఈ విషయం స్థానిక మున్సిపల్ కమిషనర్ కు,మంచిర్యాల్ అడిషనల్ కలెక్టర్ రాహుల్ రాజ్ కు బెల్లంపల్లి పట్టణ పరిరక్షణ సంఘము ఆధ్వర్యంలో వందల మంది ద్విచక్ర వాహనాల ద్వారా ర్యాలీ తీసి వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు.

బెల్లంపల్లి బజార్ ఏరియాలో గల్లీలు కబ్జా పై బజార్ ఏరియా లోని కాంట్రాక్టర్ బస్తీలో వచ్చే రహదారులు కబ్జా పై బెల్లంపల్లి మున్సిపల్ టాస్క్ పోర్స్ ద్వారా అక్రమ రహదారి కబ్జా తొలగించాలని, రాబోయే వినాయక చవితి దసరా, దీపావళి పండగలకు దూర ప్రాంతల వారు పట్టణానికి వొస్తుంటారు. ట్రాఫిక్ వల్ల ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, మెయిన్ రోడ్ పైన, ఫుట్ పాత్లపై కబ్జాలు తొలగించాలని, బెల్లంపల్లి మెయిన్ రోడ్ విస్తరణకు ముందు ఈ కబ్జాలు తొలగించాలని అధికారులకు వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు. ఈ విషయం పై సిఎం రేవంత్ కి సచివాలయం లో కూడా వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు.

error: -