భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్

కటుకూరి అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు విశ్వమాత మధర్ థెరిస్సా గారి 115వ జయంతి పురస్కరించుకుని పాల్వంచ పట్టణ పరిధిలోని “సి” కాలనీ గెట్ కే.టీ.పీ.ఎస్. ప్రాజెక్ట్ హాస్టల్ దగ్గర గల విశ్వమాత మదర్ తెరిసా గారి విగ్రహమునకు పాలాభిషేకం చేశారు.

పూలదండ వేసి మదర్ థెరిస్సా గురించి అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు కటుకూరి శేఖర్ బాబు మాట్లాడుతూ…

మదర్ థెరిస్సా సేవకు మారుపేరు, పేద ప్రజల ఆత్మ బంధువు, మాతృమూర్తి విశ్వమాతగా పేరుగాంచిన మహోన్నత వ్యక్తురాలు, భారతరత్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, పేద ప్రజల ఆరాధ్యురాలు అనాధలు కుష్టు రోగుల కటిక బీదల కోసం పిన్నవయసులో దేశం కాని దేశం వచ్చి పేద ప్రజల కోసం తన యావ జీవితాన్ని పేదల కోసం అర్పించిన సువిశాల హృదయురాలు, కడు పేదల పెన్నిధి అహర్నిశలు వారి బాగోగులు చూసిన మహోత్తమురాలు తన తుది శ్వాస వరకు పేదల బాగోగులు చూసినారు.

అలాంటి కడుపేదల పెన్నిధి అయిన విశ్వమాత మధర్ థెరిస్సా 115వ జయంతి కార్యక్రమం మా కటుకూరి అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 2012వ సంవత్సరం నుండి ఈరోజు వరకు మధర్ థెరిస్సా గారి జయంతి వేడుకలు జరుపుకోవడం “మా” అదృష్టంగా భావిస్తున్నాము.

ఆమె గురించి మాట్లాడిన కటుకూరి శేఖర్ బాబు “ఈ” యొక్క మదర్ తెరిసా గారి 115వ జయంతి వేడుకలలో పాల్గొన్నవారు బోగిని సందీప్, కిన్నెర శ్రీను, రావుల మురళి, కొండేటి జయరాజు, బర్ల విజయ కుమారి, మోకాళ్ల మంగ, ఇసనపల్లి వంశీ, దారెల్లి వెంకటేశ్వర్లు, మేశపోగు జీవన్ కుమార్, కటుకూరి అన్వేష్ కుమార్, పిన్నింటి రాజు, తదితరులు మదర్ తెరిసా జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

error: -