PRTU శాశ్వత సభ్యత్వం… కుటుంబానికి భరోసా… – జయశ్రీ.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ మండలం
✍️దుర్గా ప్రసాద్

సెప్టెంబర్ 1 మహా ధర్నా విజయవంతం చేయాలి.

రావలసిన బెనిఫిట్స్ కు యూనియన్ భరోసా… జయశ్రీ.

పాల్వంచ మండల కేంద్రంలో జిల్లా కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. జిల్లా అధ్యక్షులు నరసయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శాశ్వత సభ్యత్వాలు వాటి వల్ల కలిగే లాభాల గురించి క్షేత్రస్థాయిలో చర్చించుకోవడం జరిగినది.

సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న మండల, జిల్లా నాయకులు అత్యధిక సభ్యత్వాలను నమోదు చేయగలగడం గర్వ కారణమని జిల్లా కమిటీ పేర్కొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయులు మరణించినట్లయితే వారి కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం యూనియన్ అందించే విధంగా తీసుకున్నారు.

ఇటీవల మరణించిన చంద్రశేఖర్ అశ్వరావుపేట మండలంలోని ఉన్నత పాఠశాల లో మాథ్స్ స్కూల్ అసిస్టెంట్ గాను, ఉత్తర కుమారి జడ్పీహెచ్ఎస్ పాల్వంచ మండలం, పాండురంగాపురం గెజిటెడ్ హెచ్ గాను పనిచేశారు. చంద్రశేఖర్ సతీమణి శ్రీమతి జయశ్రీకి మరియు ఉత్తమ కుమారి భర్తకు చెరో లక్ష రూపాయల చెక్కులను అందజేశారు.

ఈ ఆర్థిక సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీమతి జయశ్రీ మాట్లాడుతూ… మా సార్ లేకపోవటాన ఆర్థికంగా ఎంతో చితికిపోయామంటూ, ఇప్పటివరకు మాకు అందవలసిన బెనిఫిట్స్ కూడా అందలేదు, యూనియన్ ద్వారా అందిస్తారని ఆశిస్తున్నాము. మా కుటుంబ సభ్యులు టిఆర్టియు రాష్ట్రశాఖకు, ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము.

సిపిఎస్ రద్దు పై సెప్టెంబర్ 1న జరగబోయే మహా ధర్నాను విజయవంతం చేయాలని సభ్యులను కోరడం జరిగినది.
ధర్నాకు సంబంధించి ప్రణాళిక మరియు కార్యాచరణ రాష్ట్ర కమిటీ తెలియజేశారు. భద్రాద్రి జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో ఉపాధ్యాయులను పాల్గొవాలని జిల్లా కమిటీ కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, అసోసియేట్ అధ్యక్షులు భాస్కరరావు, రవీందర్, కళావతి, జిల్లా కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర సభ్యులు, అన్ని మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

error: -