మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:26 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల వితరణ…
బెల్లంపల్లి: రాబోయే వినాయక చవితి సందర్భంగా మంగళవారం స్థానిక కాంటా చౌరస్తాలో దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ బుగ్గ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాలను భక్తులకు అందజేసారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ మాట్లాడుతూ…
పర్యావరణానికి ముప్పు కలిగించకుండా ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన గణపతులను ప్రతిష్టించాలని కోరారు. ప్రకృతికి హాని తలపెట్టే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేయబడిన వినాయకులను ప్రతిష్టించడం వలన పర్యావరణానికి హాని తలపెట్టినవారమవుతామని అన్నారు. ప్రజలందరూ కలిసి మెలసి భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ బాపురెడ్డి,దేవాలయ అర్చకులు సతీష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
- కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు…
- విఘ్నాలు లేకుండా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలి….
- బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన డిస్కం ఉద్యోగులు
- మానవత్వం చాటుకున్న యువకుడు…
- గణేష్ మండళ్ల నిర్వాహకులు పోలీసులకు సహరించాలి…
