మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:26 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరు మట్టి గణపతులని పూజించండి – బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్.

బెల్లంపల్లి: జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో దాతలు, సభ్యులు సహకారంతో పర్యావరణ పరిరక్షణ కొరకు బెల్లంపల్లి పట్టణం కాంట చౌరస్తా వద్ద భక్తులకు ఉచితంగా 801 మట్టి గణపతి ప్రతిమలు పంపిణీ చేయడమయినది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ పాల్గొని పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రజలు అందరు మట్టి గణపతులు పూజించాలని కోరారు. ప్రతి సంవత్సరం జనహిత సేవా సమితి వారు మట్టి గణపతులు పంపిణీ చేయడం అభినందనీయమని, జనహిత సేవా సమితి సేవలని అభినందించారు.

ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ… జనహిత సేవా సమితి ఆవిర్భావం నుండి తొమ్మిది సంవత్సరాలు గా పర్యావరణ పరిరక్షణ కొరకు దాతల సహకారం తో మట్టి గణపతులు పంపిణీ చేస్తున్నామని దాతల సహకారంతో ఈ రోజు 801 మట్టి గణపతి ప్రతిమలు పంపిణీ చేయడం జరిగిందని పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రజలు రసాయనాలతో కూడిన పీఓపీ విగ్రహాలు కాకుండా మట్టి గణపతులు పూజించి పర్యావరణ పరిరక్షణ కొరకు సహకరించాలని కోరారు.

మట్టి గణపతులు పంపిణీ కార్యక్రమం కొరకు సహకారం అందించిన దాతలకి సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ శ్రీనివాస రావు, ఫారెస్టు బీట్ ఆఫీసర్ శంకర్ రాథోడ్, మాజీ కౌన్సిలర్ గెల్లి రాజలింగు, జనహిత సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

error: -