మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:26 ఆగస్టు 2025.
✍️ మనోజ్ కుమార్ పాండే.
గణేష్ మండళ్ల నిర్వాహకులు పోలీసులకు సహరించాలి…
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన గణేష్ మండళ్ళ వద్ద నిర్వాహకులు నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ కోరారు.
మంగళవారం బెల్లంపల్లి మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ హాలులో ఏర్పాటు చేసిన మండపాల ఇంచార్జీ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వినాయక చవితి పండుగ నుండి నిమజ్జనం వేడుకలు పూర్తయ్యే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే పోలీసులు దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్, వన్ టౌన్ సీఐ కే. శ్రీనివాస్ రావు, వినాయక మండలి సభ్యులు, పీస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
- కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు…
- విఘ్నాలు లేకుండా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలి….
- బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన డిస్కం ఉద్యోగులు
- మానవత్వం చాటుకున్న యువకుడు…
- గణేష్ మండళ్ల నిర్వాహకులు పోలీసులకు సహరించాలి…
