మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:26 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

మానవత్వం చాటుకున్న యువకుడు…

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జాతీయ రహదారిపై మృతి చెందిన వరాహం కళేబరాన్ని తొలగించి మానవత్వం చాటుకున్నాడు ఓ యువకుడు…

వివరాల్లోకి వెళ్ళితే …

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గన్మెన్ బత్తుల చంద్రశేఖర్ సుబ్బారావు పల్లె జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వరాహం మృతి చెందింది.

వరాహం కళేబరం రోడ్డుపైనే ఉండడంతో స్పందించిన బత్తుల చంద్రశేఖర్ వెంటనే కళేబరాన్ని పక్కకు తొలగించారు. సాటి మనుషులకు ఏమైనా పట్టించుకోని ఈ రోజుల్లో మూగ జీవి కళేబరాన్ని తొలగించి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ గన్మెన్ బత్తుల చంద్రశేఖర్ ను పలువురు అభినందించారు.

error: -