రామగుండం పోలీస్ కమిషనరేట్
తేదీ:27. 08.2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు… – రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రజలకు, అధికారులకు సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సిపి
రామగుండం: రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయం లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులతో కలిసి పాల్గొని, పూజా కార్యక్రమం నిర్వహించి, తీర్థప్రసాదాలు తీసుకొన్నారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ…, ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని, అందరు తాము మొదలు పెట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి అయ్యేటట్లు చూడాలని, కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలలో ఉన్న సోదరభావం, ఐక్యత ఎంతో సంతోషాన్ని కలిస్తుందని, పోలీసు శాఖ సూచించిన మేరకు ఆయా మండపాల వద్ద నిర్వాహకులు, యువత పోలీస్ వారి సూచనల ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ఇదే రీతిలో విగ్రహ ప్రతిష్ట రోజు నుండి నిమజ్జనం రోజు వరకు ప్రతి ఒక్కరు పోలీస్ వారికి సహకరించాలని, ఎటువంటి ఆటంకాలు లేకుండా నవరాత్రులు, నిమజ్జన శోభయాత్ర నిర్వహించుకోవాలని ప్రజలకు సీపీ తెలిపారు.
ఈ పూజా కార్యక్రమంలో గోదావరిఖని ఎసిపి ఎం. రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్, ఆర్ఐ దామోదర్, శ్రీనివాస్, శేఖర్, మల్లేశం, సిసి హరీష్, ఆర్ఎస్ఐ లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
- కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు…
- విఘ్నాలు లేకుండా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలి….
- బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన డిస్కం ఉద్యోగులు
- మానవత్వం చాటుకున్న యువకుడు…
- గణేష్ మండళ్ల నిర్వాహకులు పోలీసులకు సహరించాలి…
