మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేది 27 ఆగస్టు 2025
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని రెండు ఎకరాల స్థలంలో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో గత ప్రభుత్వం హయాంలో నిర్మాణ దశలోనే ఆగిపోయిన అంబేడ్కర్ ఫంక్షన్ హాల్ ని సందర్శించిన బెల్లంపల్లి శాసనసభ్యుడు గడ్డం వినోద్ కు దళిత సంఘాల నాయకులు వినతి పత్రం సమర్పించారు.
ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ…, గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే అంబెడ్కర్ ఫంక్షన్ హల్ మధ్యలోనే ఆగిపోవడం బాధాకరమని కలెక్టర్ తో, సింగరేణి జీఎం తో మాట్లాడి సాధ్యమైనంత తొందరలోనే అంబేద్కర్ ఫంక్షన్ హల్ నిర్మాణ పనులను పూర్తి చేయిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలోతెలంగాణ దళిత సంఘాల ఐక్యవేదిక బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు కుంభాల రాజేష్, గౌరవ అధ్యక్షులు మల్లారపు చినరాజం, ప్రధాన కార్యదర్శి రత్నం ఐలయ్య, ఉపాధ్యక్షులు అంగూరి సుభాష్, కార్యదర్శులు గద్దల కుమార్, కాంపెల్లి సతీష్, సభ్యులు దుబాసి వెంకటస్వామి, ఎనగందుల నరేష్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
- కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు…
- విఘ్నాలు లేకుండా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలి….
- బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన డిస్కం ఉద్యోగులు
- మానవత్వం చాటుకున్న యువకుడు…
- గణేష్ మండళ్ల నిర్వాహకులు పోలీసులకు సహరించాలి…
