మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:27 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీలో గల సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ భవన్ వద్ద బుధవారం వినాయకచవితి వేడుకలు వైభవంగా జరిగాయి.
ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి శంకర్-రాజేశ్వరిల ఆధ్వర్యంలో విగ్రహ దాతలు ముత్యాల సంగీత, నాగరాజు, మోక్షిత్, రుద్రాన్ష్ కుటుంబీకులు మరియు దాతలు భక్తుల సహకారంతో గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు.
పూజారి అర్చకులు దుద్దిల్ల మాధవ కృష్ణ శర్మ వేద మంత్రోచ్ఛరణల మధ్య గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి విభిన్నమైన వివిధ ప్రసాదాలను సమర్పించారు.
ఈ సందర్భంగా బాయిజమ్మ సాయి సేవా ట్రస్టు వ్యవస్థాపకులు కాంపల్లి శంకర్ మాట్లాడుతూ…, తమ ట్రస్టు ఆధ్వర్యంలో ఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు, సేవకులు విగ్రహ దాతలు, భక్తులు దాతలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
- కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు…
- విఘ్నాలు లేకుండా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలి….
- బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన డిస్కం ఉద్యోగులు
- మానవత్వం చాటుకున్న యువకుడు…
- గణేష్ మండళ్ల నిర్వాహకులు పోలీసులకు సహరించాలి…
