భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్

పాల్వంచలోని ఐదవ వార్డు శ్రీనగర్ కాలనీలో డిపి ఎక్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించబడ్డాయి… ప్రముఖులు ప్రతినిధి వెలదండి దుర్గాప్రసాద్ గారు విఘ్నేశ్వరుని పూజల్లో పాల్గొని పట్టువస్తాలు సమర్పించారు.

మండపాలను సందర్శించి ప్రముఖ నాయకులు మాట్లాడుతూ… ఎంతో భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుడికి తొమ్మిది రోజులు పవిత్రంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఏటువంటి ఆటంకాలు కలగకుండా యువత చెడుమార్గాలకు తావు లేకుండా నిష్టగా కార్యక్రమాలు నిర్వహించాలని, భక్తుల ప్రేమ అభిమానాలు ఆశీస్సులు పొందాలని, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కోపరేటివ్ సొసైటీ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు సీపీఐ మాజీ పట్టణ కార్యదర్శి కొమ్మవరపు ఆదాము కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొండవెంకన్న కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు పైడిపల్లి మహేష్ ఎస్ వి కే ఆచార్యులు చింత నాగరాజు రాము కోరారు.

ఈ పూజ కార్యక్రమాలలో కమిటీ సభ్యులు పెద్దలు సంక నాగయ్య, ఆంగోత్ పుల్లయ్య, బోల్లెపోగు రవి, దుర్గ ప్రసాద్, బోల్లెపోగువంశీ, వేలదండి రాజేష్, గూడపాటి నరసింహారావు, నగ్మా నెహ్రు, బిక్కుమళ్ళ హనుమంతు, వెంకటేశ్వర్లు తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

error: -