ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో నిర్వహించిన ఇండియన్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు.

దేశంలో ఆహార ఉత్పత్తుల్లో ఏపీ వాటా 9 శాతమని చెప్పారు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఏపీ ప్రసిద్ధి పొందిందని వెల్లడించారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని సీఎం తెలిపారు.