మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ: 6 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో గత కొన్నేళ్ళుగా హైదరాబాద్ నుండి హజ్రత్ నిజాముద్దీన్ దక్షిణ్ ఎక్స్ ప్రెస్, చెన్నయ్ నుండి న్యూ డిల్లీ గ్రాండ్ ట్రంక్ సూపర్ ఫాస్ట్, తిరుపతి ఏపి సంపర్క్ క్రాంతి హాల్టింగ్ ఎత్తివేశారు.

ట్రైన్ హాల్టింగ్ విషయమై పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీ దృష్టికి తీసుకెళ్లిన వర్తక వాణిజ్య సంఘాల ప్రతినిధులు వారి విజ్ఞప్తి మేరకు ఎంపీ చొరవ తీసుకుని దక్షిణ్ ఎక్స్ ప్రెస్ హాల్టింగ్ కల్పించడంపై వాణిజ్య సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలియజేస్తూ, మిగతా రైళ్ళను కూడా హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని, అలాగే జైపూర్ నుండి కోయంబత్తూర్ వెళుతున్న వీక్లీ ట్రైన్ గత సంవత్సరం కాలంగా బెల్లంపల్లి స్టేషన్ లో హాల్టింగ్ ఉన్నప్పటికీ రిజర్వేషన్ సౌకర్యం లేక ప్రయాణికులు కాగజ్ నగర్, మంచిర్యాల నుండి ప్రయాణం చేయాల్సి వొస్తుందని, ఈ ట్రైన్ కు బెల్లంపల్లి స్టేషన్ నుండి రిజర్వేషన్ టికెట్ సౌకర్యం కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధులు కొలిపాక శ్రీనివాస్, బాలాజీ సోనీ, శ్యామ్ సారడా, పాత భాస్కర్, మేడి పున్నం చందర్,రాధేశ్యామ్ లాహోటీ, సురేష్ అగర్వాల్, మహేష్ శర్మ,పెద్ది రాజేందర్,రంగ రామన్న,మంగీలాల్ జవర్, ఎలుక వెంకటేష్, కోడిప్యాక విద్యా సాగర్ తదితరులు ఉన్నారు.