మంచిర్యాల జిల్లా,
తాండూరు,
తేదీ: 6 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

తాండూరు: సామాజిక ఉద్యమ నాయకుడు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి, బిజెపి నాయకులు పులగం తిరుపతి, జిల్లా కార్యదర్శి మహేందర్ గౌడ్, అధికార ప్రతినిధి కృష్ణ దేవరాయలు శాలువాతో ఘనంగా సన్మానించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో ఉన్న ఫొటోను బహుకరించారు. శనివారం తాండూరు మండల కేంద్రంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయనను కలిసి సన్మానించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు పొందిన సందర్భంగా అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గోవర్ధన్, తాండూరు మండల ప్రధాన కార్యదర్శి పుట్ట కుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యులు శ్రావణ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు సంఘర్ష శీతల్ తదితరులు పాల్గొన్నారు.