మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ: 8 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

అక్రమ హోర్డింగులు తొలగించాలని సీడీఎంఏ కు పిర్యాదు.

బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన హోర్డింగులను వెంటనే తీసివేయాలని స్థానిక న్యాయవాది మాదరి రాకేశ్ సోమవారం సీడీఏంఏ,పట్టణ మరియు గ్రామీణ ప్రణాళిక డైరెక్టర్ హైదరాబాద్ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా పిర్యాదులు చేసారు.

ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతూ, అక్రమ హోర్డింగులు ఏర్పాటు చేసారని, అనుమతి పొందిన హొర్డింగులకు కూడా తిరిగి టెండర్ ప్రక్రియ ద్వారా మున్సిపాలిటి కి ఆదాయం సమకూరేలా చూడాలని కోరినట్టు తెలిపారు.

తెలంగాణా మున్సిపల్ యాక్ట్ 2019 కి విరుద్ధంగా ప్రభుత్వ భూముల్లో, అనుమతి లేని అక్రమ హోర్డింగులను వెంటనే తొలగించాలని, బెల్లంపల్లి మున్సిపాలిటీ ఆదాయం పెంచేలా తగు చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేసినట్టు తెలిపారు.