జిల్లా ప్రెస్ క్లబ్ బ్రోచర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి వనమా – 33 మంది జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ల జిల్లా ప్రెస్ క్లబ్

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం
సెప్టెంబర్ 8,2025
✍️ దుర్గా ప్రసాద్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు రత్నకుమార్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావును పాత పాల్వంచ వారి నివాసంలో జిల్లా ప్రెస్ క్లబ్ స్టాఫ్ రిపోర్టర్ల బృందం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కు చెందిన 33 మంది జిల్లాస్టాఫ్ రిపోర్టర్ల తో కూడిన బ్రోచర్‌ను వనమా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా వారధిగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేస్తున్నా 33 మంది మీడియా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ స్టాప్ రిపోర్టర్లు మన వార్త జె పల్గుణ,, నవశకం సతీష్ మన ప్రజా పక్షం అపర్ణ తదితరులు పాల్గొన్నారు.