మంచిర్యాల జిల్లా,
కాసిపేట,
తేదీ: 8 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

కాసిపేట: సోమవారం మాదిగ దండోర కాసిపేట అధ్యక్షుడు ఆటకపురం రమేష్ మండలంలోని కొండాపూర్ చౌరస్తా యాప వద్ద రెండు సంవత్సరాలుగా రోడ్డు మొత్తం కుంగి పోయిందని, దానివల్ల
ఎందరో ప్రమాదాల బారిన పడ్డారని, రోడ్డుపై గుంతల మధ్య బైఠాయించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…, రోడ్డుపై గుంతల వల్ల ఇక్కడ ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగాయని, అయినా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది కమిషన్ల కోసం ఆశపడి ఈ రోడ్డును ఆపుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఈ రహదారి గుండా కాసిపేట, దేవాపూర్ కు రాక పోకలు సాగిస్తున్నారని, దేవాపుర్ ఎన్నికల సమయంలో ఆగ మేఘాల మీద తమ అభ్యర్థి గెలుపుకోసం పర్యటించారు.

కానీ ప్రజా సమస్యలపై ఏమాత్రం పట్టింపు లేదని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు,ప్రజా ప్రతినిధులు స్పందించి రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని, ప్రమాదాలను నివారించాలని మాదిగ హక్కుల దండోరా సంఘం తరపున విజ్ఞప్తి చేశారు.