మెగా కుటుంబంలో సంతోషకరమైన వార్త. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులకు పండంటి బాబు పుట్టాడు.

తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని సమాచారం. 2023లో వివాహం చేసుకున్న ఈ జంట, ఈ ఏడాది మేలో గర్భవతి అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారిద్దరూ తల్లిదండ్రులు కావడంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.