నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో మెప్పిస్తున్న జాకీ ష్రాఫ్, తాజాగా ఒక ఆసక్తికర రహస్యం బయటపెట్టారు.

మాధురి దీక్షిత్, జూహీ చావ్లా వంటి హీరోయిన్లతో రొమాంటిక్ లేదా కిస్సింగ్ సీన్స్ చేయాల్సి వచ్చిందంటే తాను చాలా టెన్షన్‌ పడేవాడినని చెప్పారు. ఆ భయం తగ్గించుకోవడానికి బ్రాందీ తాగి కెమెరా ముందు నిలబడినట్లు ఒప్పుకున్నారు.

1989లో వర్ది, 1993లో ఆయినా చిత్రాల షూటింగ్ సమయంలోనే ఇది జరిగిందని జాకీ తెలిపారు. అభిమానులు ఆయనను “సెక్సీ ష్రాఫ్” అని పిలిచినా, నిజానికి ఇంటిమేట్ సీన్స్ తనకు కష్టంగానే అనిపించేవని చెప్పారు.