ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ చరిత్ర సృష్టించారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ను అధిగమించి ఆయన బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో మొదటి స్థానంలో నిలిచారు.

ప్రస్తుతం ఎల్లిసన్ నికర సంపద 393 బిలియన్ డాలర్లు (₹34.60 లక్షల కోట్లు) కాగా, మస్క్ సంపద 385 బిలియన్ డాలర్లు (₹33.90 లక్షల కోట్లు). ఒరాకిల్ త్రైమాసిక ఫలితాలు అంచనాలకు మించి రావడంతో బుధవారం కంపెనీ షేర్లు 41% పెరిగి $336 చేరాయి. ఎల్లిసన్ వద్ద ఉన్న 116 కోట్ల షేర్ల విలువ ఒక్కరోజులోనే ₹9 లక్షల కోట్లు పెరిగింది.