భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం
సెప్టెంబర్ 11,2025
✍️దుర్గా ప్రసాద్
మణుగూరు నుండి తిరుపతికి, షిరిడీకి ప్రత్యేక రైలు నడపాలి.
కాకతీయ ఎక్స్ ప్రెస్ ను కొత్తగూడెం నుండి మణుగూరు వరకు పెంచి నడపాలి.
కొత్తగూడెం ప్రగతి మైదాన్ రాజీవ్ పార్క్ కువెళ్లే దారిని రీ ఓపెన్ చేయాలి.
రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని విలేకరులకు సీనియర్ సిటిజన్స్ కు రైల్వేస్ లో ఉచిత ప్రయాణ పాసులు కల్పించాలని సౌత్ సెంట్రల్ రైల్వే ఏవో రాజేంద్ర బాబు ను కలిసి సమస్యలను వివరించి వినతిపత్రం అందించిన సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ వై శ్రీనివాస్ రెడ్డి. సౌత్ సెంట్రల్ రైల్వే బి డి సి ఆర్ రోడ్ ఏవోగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాజేంద్ర బాబును సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డ్ డి. ఆర్. యు. సి. సి. మెంబర్ వై.శ్రీనివాసరెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి సాల్వతో పుష్పగుచ్చాలు అందించి సత్కరించి అభినందనలు తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా రైల్వే బోర్డు మెంబర్ శ్రీనివాస్ రెడ్డి సమస్యలను వివరిస్తూ… కొత్తగూడెం ప్రాంత రైల్వే సమస్యలను పరిష్కరించాలని కొత్తగూడెం నుంచి బెల్గావి ఎక్స్ ప్రెస్ ను గతంలో రద్దు చేశారని ఆ రైలును తక్షణం పునరుద్ధరించాలని, అదేవిధంగా కాజీపేట నుండి కొత్తగూడెం వరకు రైలును తక్షణం పునరుద్ధరణ చేయాలని విజ్ఞప్తి చేశారు.
కాకతీయ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ గతంలో మణుగూరు వరకు నడిపారని దానిని ప్రస్తుతం కొత్తగూడెం వరకు మాత్రమే నడుపుతున్నారని తిరిగి మణుగూరు వరకు పెంచి నడపాలని కోరారు. డోర్నకల్ నుండి కొత్తగూడెం వరకు మంజూరైన డబ్లింగ్ రైల్వే లైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని తద్వారా కారేపల్లిలో రెండవ ఫ్లాట్ ఫామ్ కొత్తగూడెంలో మూడో నెంబర్ ప్లాట్ ఫామ్ నిర్మించాలని చెప్పారు.
కొత్తగూడెం కేంద్రం నుండి అటు కొవ్వూరు రైల్వే లైను ఇటు భద్రాచలం మీదగా ఛత్తీస్ గడ్ కీరండోల్ వరకు రైల్వే లైన్స్ పూర్తి చేయడం ద్వారా కొత్తగూడెం కేంద్రంగా రైల్వే జంక్షన్ ఏర్పాటు చేయాలని తద్వారా కొత్తగూడెం ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని వివరించారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ధి నిర్మాణ పనులు నత్త నడకగా నడుస్తున్నాయని వీటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రయాణికులకు ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని విన్నవించారు.కొత్తగూడెం నడిబొడ్డున ఉన్న ప్రగతి మైదాన్ రాజీవ్ పార్క్ వద్ద గతంలో రైల్వే ట్రాక్ పై ఉన్న దారిని మూసివేశారని దీనివలన మార్నింగ్ వాకర్సు పాదాచారులు, టూ వీలర్స్ మీద వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణం ఈ దారిని ఏర్పాటు చేయాలని కోరారు.పైన తెలిపిన రైల్వే సమస్యలను ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి ద్వారా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులతో పాటు ఇండియన్ రైల్వే అధికారులకు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు పలుమార్లు విన్నవించడం జరిగిందని వివరించారు.
ఈ సందర్భంగా రైల్వే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్.ఎఓ. రాజేంద్ర బాబు మాట్లాడుతూ… తప్పనిసరిగా రైల్వే సమస్యలను పరిష్కరిస్తామని కాకతీయ ట్రైన్ మణుగూరు వరకు పెంచి నడుపుతామని, కొత్తగూడెం రైల్వే స్టేషన్ పనులు త్వరగా పూర్తి చేపిస్తామని, బెల్గావి కాజీపేట రైళ్ల పునరుద్ధరణ కోసం కృషి చేస్తామని, కొత్తగూడెం రాజీవ్ పార్క్ వద్ద దారి ఏర్పాటుకు పరిశీలన చేసి వాకర్స్ పాదాచారులు, టూ వీలర్స్ వెళ్లే విధంగా దారి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి…
- ఏపీలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ కసరత్తు వేగవంతం
- ఏపీలో కుప్పకూలిన టమాటా, ఉల్లి ధరలు…
- రియల్ మనీ గేమింగ్ నిషేధంతో ఉద్యోగులను తొలగించిన జుపే… ఎంతమందంటే…
- నేపాల్‌లోని పలు జైళ్ల నుంచి వేలాది ఖైదీలు పరారీ
- హిజ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు… ఎక్కడంటే…
- ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సి.పి. రాధాకృష్ణన్
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- EMI బకాయిలపై ఫోన్ లాక్ – RBI కొత్త రూల్ పరిశీలనలో
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- నందిగామ మాగల్లు సొసైటీ చైర్మన్‌గా టిడిపి నేత అప్పారావు – డైరెక్టర్లుగా ముక్కంటయ్య, భద్రమ్మఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా – నందిగామ
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
- సెంట్రల్ మెడికల్ స్టోర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- స్వాస్థ్ నారీ – శ్వసక్త్ పరివార్ అభియాన్ విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జతేష్ వి. పాటిల్.
- కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన జి.ఎం. షాలేం రాజు
- ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా చరిత్ర సృష్టించిన లారీ ఎల్లిసన్
- వక్ఫ్ బోర్డు సీఈఓ ను వెంటనే నియమించాలి- మైనారిటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా
- జనగామలో ఆస్తి కోసం కూతురు చేత తల్లి హత్య
- తెలంగాణలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు వేగంగా పూర్తి… – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
