నందిగామ మాగల్లు సొసైటీ చైర్మన్‌గా టిడిపి నేత అప్పారావు – డైరెక్టర్లుగా ముక్కంటయ్య, భద్రమ్మ
ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా – నందిగామ

ఆంధ్రప్రదేశ్
నందిగామ
✍️ దుర్గా ప్రసాద్

నందిగామ మాగల్లు సొసైటీ చైర్మన్‌గా టిడిపి నాయకుడు సూరంపల్లి అప్పారావును ప్రభుత్వం నియమించింది. అలాగే డైరెక్టర్లుగా కొండూరు గ్రామానికి చెందిన టిడిపి నాయకులు కొర్రపాటి ముక్కంటయ్య మరియు గారీగంటి భద్రమ్మలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సందర్భంగా డైరెక్టర్‌గా ఎన్నికైన కొర్రపాటి ముక్కంటయ్యను జగ్గయ్యపేట ఎమ్మెల్యే తాతయ్య, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, టిడిపి సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు, కేడి సిసి బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, తాతయ్య తమ్ముడు పెద్దబాబు మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు.

ముక్కంటయ్య మాట్లాడుతూ… – రైతే రాజు అన్న సిద్ధాంతంతో ముందుకు సాగుతూ, రైతులకు అందుబాటులో ఉండి సహాయం చేస్తానని, ఎరువులు సకాలంలో అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ ఎన్నిక సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సిపిఐ మాజీ పట్టణ కార్యదర్శి కొమ్మవరపు ఆదాం కూడా శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి…