భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం
✍️దుర్గా ప్రసాద్

నాయకులగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా మాట్లాడుతూ … తెలంగాణా సాయుధ పోరాట యోధుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. సెప్టెంబర్ 17 ప్రజాస్వామ్య హక్కులు సాధించిన దినమని గుర్తుచేశారు.

నేటి దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాట స్పూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. పోరాటయోధుల త్యాగం చిరస్థాయిగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.