ఉపరాష్ట్రపతిగా సి.పి. రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ వేడుకలో ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

67 ఏళ్ల రాధాకృష్ణన్ తమిళనాడు తిరుప్పూర్‌లో జన్మించారు. ఆయన 1998, 1999లో కోయంబత్తూరు నుంచి ఎంపీగా గెలిచారు. 2004–2007లో తమిళనాడు బిజెపి అధ్యక్షుడిగా పనిచేశారు. ఝార్ఖండ్, తెలంగాణ, మహారాష్ట్ర గవర్నర్‌గా సేవలందించారు. తాజాగా జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బి.సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన మూడో నాయకుడిగా రాధాకృష్ణన్ నిలిచారు.