ఆంధ్రప్రదేశ్‌లో టమాటా, ఉల్లి ధరలు భారీగా క్షీణించాయి. వర్షాల కారణంగా పంటలు కుళ్లిపోతుండడంతో కిలో టమాటా పత్తికొండ మార్కెట్లో రూ.2కి, నంద్యాల, మదనపల్లెల్లో రూ.3–10కి అమ్ముడయ్యాయి. కర్నూలు మార్కెట్లో ఉల్లి క్వింటా రూ.150కి మాత్రమే విక్రయమైంది.

రైతులు కనీసం కూలి ఖర్చులు కూడా రాక నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు టమాటాను రోడ్లపై పారేస్తూ, ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.