< 1 Min

మంచిర్యాల జిల్లా
బెల్లంపల్లి
తేదీ:16 సెప్టెంబర్ 2025
✍️ మనోజ్ కుమార్ పాండే

నేత్రదానం తో ఇద్దరు అందుల జీవితంలో వెలుగులు నింపిన జంగపల్లి రాజారాం

బెల్లంపల్లి:బెల్లంపల్లి మండలం, బుధకుర్దు గ్రామానికి చెందిన జంగపల్లి రాజారాం వయస్సు(69) సంవత్సరాలు ప్రమాదవశాత్తు మరణించగా వారి అల్లుడు జనహిత సేవా సమితి ప్రధాన కార్యదర్శి ఇప్పరవి వారి కుటుంబ సభ్యులకు నేత్రదానం గురుంచి వివరించగా, వారి కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖం లో ఉండి కూడా నేత్రదానం ద్వారా ఇద్దరు జీవితాల్లో వెలుగులు నింపాలని భావించి నేత్రదానం కి అంగీకరించడంతో, సదశయా ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ సహకారంతో ఎల్.వి.ప్రసాద్ ఐ బ్యాంక్ సిబ్బంది సతీష్ నేత్రాలని స్వీకరించారు.

ఈ సందర్భంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ జంగపల్లి రాజారాం కుటుంబ సభ్యుల స్ఫూర్తితో ప్రజలందరూ మరణించిన తరువాత నేత్ర, అవయవ దానాలు చేసి మరొకరి జీవితంలో వెలుగులు నింపాలని కోరారు. శరీరాలు కాలి బూడిద అయి వృధా కాకుండా దానం చేసి సమాజానికి ఉపయోగపడాలని కోరారు.

మరణించిన తరువాత ఎనిమిది గంటల లోపు మరణించిన వ్యక్తి యొక్క కళ్లలోని కార్నియా పొరని మాత్రమే సేకరిస్తారని నేత్ర దానం ద్వారా ఇద్దరు అందులకి చూపు ప్రసాదించి వారి ద్వారా మరణించిన వ్యక్తి ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం ఉందని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయినప్పుడు వారి అవయవాలు దానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో అవయవాలు అవసరం ఉన్న ఎనిమిది మంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని, అలాగే శరీర దానం ద్వారా పార్థివ దేహాన్ని వైద్య కళాశాల కి అందించి కొన్ని వేల వైద్య విద్యార్థుల బోధనకు ఉపయోగపడి ప్రజల వైద్య చికిత్సకి ఉపయోగపడే అవకాశం ఉందని అన్నారు.

ప్రజలందరూ అపోహలు వీడి నేత్ర, అవయవ, శరీర దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జనహిత సేవా సమితి ప్రధాన కార్యదర్శి ఇప్ప రవి గతంలో వారి తల్లి నేత్రాలని, ఇప్పుడు వారి మామయ్య నేత్రాలని దానం చేసేందుకు కృషి చేసి ఆదర్శంగా నిలిచారని వారిని అభినందించారు. నేత్రదాత జంగపల్లి రాజారాం కుటుంబ సభ్యులు భార్య జంగపల్లి లక్ష్మి, కుమారుడు జంగపల్లి శ్రీకాంత్, కోడలు, కుమార్తెలు, అల్లుళ్లు,కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వీరి స్పూర్తితో ప్రజలు మరింత నేత్రదానం కొరకు ముందుకు రావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కాంపెల్లి విజయ్ కుమార్,కుటుంబ సభ్యులు బంధు మిత్రులు పాల్గొన్నారు .