మంచిర్యాల జిల్లా,
మందమర్రి,
తేదీ:16 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే,
బావిలోకి దూకి వృద్ధురాలు ఆత్మహత్య
మందమర్రి: మంచిర్యాల జిల్లా,మందమర్రి పట్టణంలోని దీపక్ నగర్లో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పిట్టల లక్ష్మి (65) అనే గృహిణి బావిలో పడి మృతి చెందారు.
జీవితంపై విరక్తితోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళ్ళితే…,
మృతురాలి భర్త పిట్టల లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం తెల్లవారు జామున సుమారు 3 గంటల ప్రాంతంలో ఆయన నిద్రలేచి చూడగా తన భార్య లక్ష్మి మంచం మీద లేదు. చుట్టు పక్కల వెతకగా, ఇంటికి సమీపంలో ఉన్న బావిలో ఆమె మృతదేహం కనిపించిందని తెలిపాడు.
ఈ హఠాత్ పరిణామంతో తీవ్ర ఆందోళనకు గురైన లక్ష్మయ్య వెంటనే తన కుమారులకు మరియు పోలీసులకు సమాచారం అందించారు.
మృతురాలి చిన్న కుమారుడు పిట్టల రమేష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, తమ తల్లి లక్ష్మి గత ఒక సంవత్సర కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు.
ఆమె డయాలసిస్ పేషెంట్ అని, అలాగే బీపీ మరియు షుగర్ వంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తమ తల్లికి నలుగురు కొడుకులు ఉండగా, పెద్ద కొడుకు గతంలో కిడ్నీ సమస్యతో చనిపోయాడని కూడా వివరించారు. ఈ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, కొడుకు మరణంతో మనస్థాపానికి గురైన తమ తల్లి ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడిందని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు.
మృతురాలి మరణంపై చిన్న కొడుకు పిట్టల రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మందమర్రి ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి…
- Healthy Hair Diet: జుట్టు పెరుగుదలకు మేలైన ఆహారాలు
- Fish Mercury Warning: పాదరసం అధికంగా ఉండే చేపలు తినడంలో జాగ్రత్త అవసరం
- TRVKS జెన్కో కార్యదర్శిగా ఎన్నికైన ముత్యాల రాంబాబు
- ఎస్బీఐలో 10 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – అక్టోబర్ 28లోపు దరఖాస్తు చేయండి
- రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల 69 వేల192 మహిళా శక్తి చీరల పంపిణీ
- బంజారాహిల్స్‌లో రూ.750 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం – హైడ్రా చర్యలు సంచలనం
- మధ్యప్రదేశ్‌లో మాజీ చీఫ్ ఇంజనీర్ అవినీతి గూటి బట్టబయలు – కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం
- నోబెల్ శాంతి బహుమతికి మరియా కొరినా మచాడో ఎంపిక – ట్రంప్‌కు నిరాశ
- రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు బీసీ సంఘాల పిలుపు – రిజర్వేషన్ల అమలుపై ఆర్.కృష్ణయ్య డిమాండ్