< 1 Min

మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:17 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ చేతుల మీదుగా జెండా వందన కార్యక్రమం నిర్వహించబడింది.

జెండా వందన కార్యక్రమం అనంతరం మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛత ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుండి గాంధీ విగ్రహం వరకు మున్సిపల్ సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు మున్సిపల్ సిబ్బంది,మెప్మా ఆర్.పి.లు, ఎస్.హెచ్.జి సభ్యులు పాల్గొన్నారు.