మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:17 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ వీర బ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో బుధవారం బెల్లంపల్లి మండల విశ్వబ్రాహ్మణ,విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 8 గంటలకు స్వామి వారికి సుప్రభాత సేవ నిర్వహించారు. ఉదయ 9 గంటల సమయంలో ఆలయ సమీపంలో విశ్వకర్మ పతాక ఆవిష్కరణ చేసి, ధ్వజారోహణం చేసారు.
అనంతరం బెల్లంపల్లి బజార్ ఏరియాలోని ప్రధాన రహదారులు, పట్టణ పుర వీధులలో విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం నాయకులు, కార్యవర్గ సభ్యులు, కుల బాంధవులు భారీ బైక్ ర్యాలీ తీశారు.
అనంతరం ఆలయంలో విశ్వకర్మ యజ్ఞం ప్రారంభించారు. మహా నైవేద్యం, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ అనంతరం వెయ్యి మందికి పైగా భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… సకల వేదాల ప్రకారం విశ్వకర్మ సృష్టికర్త అని, తన కళా నైపుణ్యం ద్వారా భారతదేశ విశిష్టతను ప్రపంచానికే చాటిచెప్పిన గొప్ప రూపకర్త అని సంఘం నాయకులు పేర్కొన్నారు.
విశ్వబ్రాహ్మణ కులస్తులందరూ ఐకమత్యంగా ఉండి ప్రభుత్వం నుండి రావలసిన హక్కులను సాధించాలని ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి…