< 1 Min

మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:19 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం “స్వచ్చతా హీ సేవా” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో భాగంగా, పోచమ్మ చెరువు పరిసరాలను శుభ్రపరిచే ప్రత్యేక డ్రైవ్ చేపట్టడమయినది. చెరువు చుట్టుపక్కల పేరుకుపోయిన చెత్తను తొలగించడం ద్వారా స్థానిక ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించే దిశగా చర్యలు తీసుకున్నారు. అనంతరం 4 వ వార్డు లోని పార్కులో పేరుకుపోయిన చెత్తను సిబ్బంది సమిష్టిగా తొలగించారు.

పార్కును శుభ్రపరచి, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే దిశగా చర్యలు చేపట్టారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ ప్రత్యక్షంగా పాల్గొని, సిబ్బందికి పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. శుభ్రత కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా, ప్రజలందరూ కలిసికట్టుగా పాల్గొనాల్సిన అవసరం ఉందని, అలా చేసినప్పుడే మన బెల్లంపల్లి పట్టణాన్ని చెత్త రహిత పట్టణముగా తీర్చి దిద్దగలమని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఈ విధమైన కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషించాలని కోరారు.