< 1 Min

మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:22 సెప్టెంబర్ 2925,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని అశోక్ నగర్ లో వినాయక చవితి ముందు కలువ నుండి తీసిన మట్టి,రోడ్డుకు ఇరు వైపుల ఉన్న చెట్లు తొలగించి కుప్పలు చేసి పెట్టారు.

ఇటీ వలే కురిసిన వర్షాలకు తడిచి,ఎండలకు ఎండి అందులో పాములు కూడా ఆశ్రయం పొందుతున్నాయి. మరి వైపు దోమలు విపరీతంగా పెరిగి విష జ్వరాలు వ్యాపిస్తున్నాయి. అశోక్ నగర్ జవాన్ శ్రీనివాస్ కు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయరు,ఒక వేళ లిఫ్ట్ చేసినా డ్రైవర్లు లేరు, ట్రాక్టర్ పాడయిందని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ ఫోన్ కట్ చేయడం పరిపాటిగా మారింది.

బెల్లంపల్లి పట్టణంలో కొన్ని వార్డుల్లో మాత్రమే పారిశ్యుద్ధ పనులు నడుస్తున్నాయడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికైనా పట్టణంలోని అన్ని వార్డుల్లో పారిశ్యుద్ధ పనులను సక్రమంగా చేపట్టే విధంగా మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ చర్యలు చేపట్టాలని, విధుల్లో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పుర ప్రజలు కోరుతున్నారు.