< 1 Min

ఢిల్లీ మెట్రోలో ఇద్దరు ప్రయాణికులు ఒకరికొకరు దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోచ్ కిక్కిరిసి ఉన్న సమయంలో వీరి మధ్య వాగ్వాదం భౌతికదాడులకు దారి తీసింది.

వారిద్దరూ ఒకరిపై ఒకరు తన్నుకుంటూ, కొట్టుకుంటూ కనిపించారు. ఈ దృశ్యాలను ఓ ప్రయాణికుడు వీడియో తీసి షేర్ చేశాడు. కొంతసేపటి తర్వాత ఇతర ప్రయాణికులు మధ్యలోకి వచ్చి వారిని విడదీశారు.

గొడవకు దుర్భాషలాడటమే కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. “ఇది ఢిల్లీలో సాధారణం,” అని కొందరు అనగా, “మనుషుల్లో మానవత్వం తగ్గిపోతుంది,” అంటూ మరికొంతమంది స్పందించారు. ఎట్టకేలకు, ఢిల్లీ మెట్రో ఒక్కసారిగా రెజ్లింగ్ రింగ్‌గా మారింది.